Sunday, June 6, 2010

ప్రేమా,డబ్బు

కొన్ని సంవత్సరాల క్రితం.... హాయిగా బ్రతకాలంటే ప్రేమ వుంటే చాలు అనుకొనేవాడిని.ప్రేమించాను..ప్రేమ తప్ప ఈ లోకంలో ఇంక దేనినీ ఖాతర్ చెయ్యనంతగా. అందులో పడి నా వునికినే వదిలేసేంతగా మునిగిపోయాను. పార్క్లు, బీచ్,సినిమాలూ, ఆనందాలూ, బాధలూ,కన్నీళ్లు,నవ్వులూ అన్నిటికీ ప్రేమే ఆధారంగా అనుకొన్నాం.




కొన్ని సంవత్సరాలు గడిచాయి....ఇప్పుడు అన్నిటికీ డబ్బు వుండాలనిపిస్తుంది. పార్క్లు,బీచ్,సినిమాలూ, ఆనందాలూ, బాధలూ,కన్నీళ్లు,నవ్వులూ అన్నిటికీ డబ్బు లేకపోతే ఏదీ మనకు దక్కదేమో అనిపిస్తుంది. బందాలూ, ఆప్యాయతలూ ,పండగలూ,చావులూ అన్నీ డబ్బు చుట్టునే తిరుగుతున్నై అనిపిస్తుంది.


ఈ రెండు దారుల వెంట ప్రయాణం చేసి వచ్చాక ఇప్పుడు.....జీవితం గడపాలంటే ప్రేమా,డబ్బు రెండూ వుండాలని అర్ధం అయింది. కాకుంటే అవి పరస్పరం ఒకదానికొకటి విలువని పెంచుకొనేలా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం ప్రేమికులదే.